దిశ కేసు ఎన్‌కౌంటర్: ట్రెండింగ్ చేయండి
తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ కేసు నిందితులను పోలీసులు శుక్రవారం ఎన్‌కౌంటర్ చేశారు. దీనిపై టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు హరీశ్ శంకర్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వానికి, సీపీ సజ్జనార్‌కు కృతజ్ఞతలు తెలిపాడు. సజ్జనార్ పది కాలాల పాటు చల్లగా ఉండాలంటూ కామెంట్ చేశాడు. 'సినిమాకు సంబంధించిన ట్రైలర్లు, టీజర్లు పట్టించుకోకపోయినా పర్లేదు. కానీ దిశ కేసు నిందితుల ఎన్‌కౌంటర్ వార్తను విస్తృతంగా ప్రచారం చేయండి
అందరికీ తెలిసేలా చాటింపు వేయండి' అని అభిమానులను కోరాడు. కాగా నవంబర్ 28న వెటర్నరీ డాక్టర్ దిశపై అత్యంత పాశవికంగా హత్యాచారం జరిగింది. దీనికి కారణమైన నిందితులను వెంటనే ఉరితీయాలంటూ దేశంలో పెద్దఎత్తున ఆగ్రహావేశాలు వ్యక్తమయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు పాల్పడిన నలుగురు నిందితులను కస్టడీలోకి తీసుకుని కేసు రీకన్‌స్టక్షన్ చేస్తుండగా పోలీసుల ఆయుధాలు తీసుకొని పారిపోవడానికి యత్నించారు. దీంతో పోలీసులు నలుగురు నిందితులను ఎన్‌కౌంటర్ చేశారు.